భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇజ్రాయెల్, హెజ్బొల్లా పరస్పర దాడులు

-

ఇజ్రాయెల్, హెజ్‌బొల్లా మధ్య భీకర దాడులతో పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. ఆదివారం తెల్లవారుజామున దక్షిణ లెబనాన్‌పై యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్‌ విరుచుకుపడగా.. ప్రతిదాడిగా హెజ్‌బొల్లా రాకెట్ల వర్షం కురిపించింది. వందల రాకెట్లు, డ్రోన్లను ఉపయోగించి దాడులకు దిగడంతో అక్క ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అప్రమత్తమైన అమెరికా ఇజ్రాయెల్‌ సమీపానికి యుద్ధ నౌకలను పంపింది. దాడులతో ఇరాన్‌తోపాటు మిలిటెంట్‌ గ్రూపులు అప్రమత్తమయ్యాయి. కొన్ని నెలలుగా స్వల్ప స్థాయి కవ్వింపులకే పరిమితమైన ఇజ్రాయెల్, హెజ్‌బొల్లాలు ఇప్పుడు భారీ స్థాయిలో దాడులకు దిగడంతో.. పశ్చిమాసియాలో మరో పెను యుద్ధం వస్తుందేమోనని తీవ్ర భయాందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్, హెజ్‌బొల్లా సంయమనం పాటించాలని ప్రపంచ దేశాలు పిలుపునిచ్చాయి.

హెజ్‌బొల్లా తమ దేశంపై భారీగా రాకెట్లను, డ్రోన్లను, క్షిపణులను ప్రయోగించనుందన్న సమాచారంతోనే వైమానిక దాడులకు దిగినట్లు ఇజ్రాయెల్‌ తెలిపింది. ఉత్తర ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా ప్రయోగించిన వందలకొద్దీ రాకెట్లను అడ్డుకున్నామని, ప్రజలు అధికారుల ఆదేశాలను పాటించాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news