తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాల్టి నుంచి మరో నాలుగు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు బయటకు వెళ్లకూడదని కూడా సూచించింది. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ.

అంతేకాదు హైదరాబాద్ మహానగరంలో కూడా.. నాలుగు రోజులపాటు భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ మహానగరంలో సాయంత్రం పూట నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు… తెలిపింది. అదే సమయంలో దక్షిణ తెలంగాణ జిల్లాలలో కూడా మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది.