ఉక్రెయిన్‌కు అండగా జీ7 దేశాలు.. రూ.4లక్షల కోట్ల రుణ ప్యాకేజీ

-

ఉక్రెయిన్ రష్యాల భీకర యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌కు అండగా నిలిచేందుకు జీ7 దేశాలు ముందుకొచ్చాయి. ఉక్రెయిన్​కు రూ.4.17 లక్షల కోట్ల (5 వేల కోట్ల డాలర్లు) రుణ ప్యాకేజీ అందించాలని నిర్ణయించాయి. వివిధ దేశాల్లో స్తంభింపజేసిన రష్యా ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం, వడ్డీ నుంచి ఆ నిధులను సమకూర్చాలని జీ7 దేశాలు తాజాగా తీర్మానించాయి.

ఇటలీలో జీ7 శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైన వేళ గురువారం ఈ మేరకు కీలక పరిణామం చోటుచేసుకుంది. రష్యాపై ఆంక్షల కారణంగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో దాదాపు రూ.21.72 లక్షల కోట్ల విలువైన ఆ దేశ ఆస్తులు స్తంభించాయి. వాటిలో అత్యధికం ఐరోపా దేశాల్లోనివే. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగి భారీ విధ్వంసం సృష్టించినందుకు రష్యా పరిహారం చెల్లించేదాకా, ప్రస్తుతం స్తంభింపజేసిన ఆ దేశ ఆస్తులపై ఆంక్షలను తొలగించకూడదనీ అమెరికా, ఐరోపా దేశాలు నిర్ణయించాయి. తాజా రుణ ప్యాకేజీలో భాగంగా తొలి విడత నిధులు ఈ ఏడాదే ఉక్రెయిన్‌కు అందనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news