ఇజ్రాయెల్, హమాస్ల మధ్య యుద్ధం రోజురోజుకు భీతావహంగా తయారవుతోంది. హమాస్ మిలిటెంట్ల అంతమే అంతిమ లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం గాజాపై విరుచుకు పడుతోంది. ఓవైపు భూతల దాడులు, మరోవైపు వైమానిక దాడులతో ఆ ప్రాంతంలో మారణ హోమం సృష్టిస్తోంది. ఈ దాడుల్లో సామాన్య పౌరులతో పాటు పొరపాటున తమ బంధీలను కూడా చంపుకుంటోంది. ఇలా గాజాపై నిరంతరంగా యుద్ధం సాగిస్తున్న ఇజ్రాయెల్కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. హమాస్‌కు మద్దతుగా లెబనాన్‌లోని మిలిటెంట్ సంస్థ హెజ్‌బొల్లా ఇజ్రాయెల్‌పై ఎదురుదాడులకు తెగబడింది. తాజాగా అత్యంత దుర్భేద్యమైన ఐరన్ డోమ్ గగనతల రక్షణ వ్యవస్థపై ఈ సంస్థ దాడి చేయడంతో ఇజ్రాయెల్‌కు గణనీయంగా నష్టం వాటిల్లినట్లు సమాచారం.
ఉత్తర ఇజ్రాయెల్‌లోని కబ్రి ప్రాంతంలో రెండు ఐరన్ డోమ్ వ్యవస్థలపై దాడి చేసినట్లు హెజ్‌బొల్లా ప్రకటన విడుదల చేసింది. ఈ దాడిలో రెండు లాంచింగ్ ప్లాట్‌ఫామ్‌లు తీవ్రంగా దెబ్బతిన్నట్లు పేర్కొంది. హెజ్‌బొల్లా ప్రకటనపై మాత్రం ఇజ్రాయెల్ సైన్యం స్పందించలేదు. ఈ మిలిటెంట్ గ్రూప్‌ను లక్ష్యంగా చేసుకుని దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులు చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.