ప్రచారంలో కమలా హ్యారిస్ జోరు.. 3.60 లక్షల మంది వాలంటీర్ల సపోర్టు

-

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీగా ప్రచారం సాగుతోంది. లేట్గా ఎంట్రీ ఇచ్చినా లేటెస్ట్గా ప్రచారంలో దూసుకెళ్తున్నారు డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌. మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ను ఎదుర్కొనేందుకు డెమోక్రాట్ల నుంచి ఆమెకు ఫుల్ సపోర్టు లభిస్తోంది. ఓవైపు భారీ మొత్తంలో విరాళాలు వెల్లువెత్తుతుండగా.. తాజాగా కమలకు సపోర్టుగా ప్రచార పర్వంలో 3.60 లక్షల మంది వాలంటీర్లు చేరారు.

కమలా హారిస్‌ ప్రచారంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారని హారిస్ ఫర్ ప్రెసిడెంట్ బాటిల్‌గ్రౌండ్‌ స్టేట్స్‌ డైరెక్టర్‌ డాన్‌ కన్నీనెన్‌ తెలిపారు. ఒక వారంలోనే 200 మిలియన్ల డాలర్ల విరాళాలు సేకరించామని.. మూడింట రెండు వంతుల విరాళాలు కొత్త మద్దతుదారుల నుంచే అందాయని చెప్పారు. షికాగోలో వచ్చే నెల జరగనున్న డెమోక్రటిక్ పార్టీ జాతీయ సమావేశంలో కమలా హారిస్‌ అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.

మరోవైపు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు కీలకమైన ఏడు రాష్ట్రాల్లో ప్రజలు కమలా హ్యారిస్ వైపే మొగ్గు చూపుతున్నట్లు యూఎస్‌ పొలిటికల్‌ వెబ్‌సైట్‌ ‘ద హిల్‌’ వెల్లడించింది. హోరాహోరీ పోరు సాగే రాష్ట్రాల్లో కమలకు 48 శాతం మంది ఓటర్లు మద్దతిస్తున్నట్లు తెలిపింది. ట్రంప్‌నకు 47 శాతం మంది ఓటర్ల మద్దతు ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్‌ న్యూస్‌/మార్నింగ్‌ కన్సల్ట్‌ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news