తుపాకీ కేసులో దోషిగా బైడెన్ కుమారుడు

-

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కుమారుడు హంటర్‌ బైడెన్​కు విల్మింగ్టన్ కోర్టు షాక్ ఇచ్చింది. తుపాకీ కొనుగోలు సందర్భంగా తప్పుడు సమాచారం ఇచ్చిన కేసులో ఆయణ్ను దోషిగా తేల్చింది. ఆయనపై మోపిన మూడు అభియోగాల్లోనూ నేర నిర్ధరణ జరిగడంతో డెలావెర్‌లోని విల్మింగ్టన్‌ కోర్టు జడ్జి మేరీ ఎల్లెన్‌ నోరీకా హంటర్‌ నేరాన్ని నిర్ధరించారు. అయితే శిక్షా కాలాన్ని మాత్రం వెల్లడించలేదు.

వాస్తవానికి ఇటువంటి కేసుల్లో 25 ఏళ్ల వరకు కూడా జైలు శిక్ష పడుతుంది.  తొలిసారి నేరానికి పాల్పడినందున అంత కాలం శిక్ష పడకపోవచ్చని న్యాయ నిపుణులు అంటున్నారు. తీర్పు వెలువరించిన వెంటనే హంటర్‌ భావోద్వేగానికి గురయ్యారు. అక్కడే ఉన్న తన న్యాయవాదితోపాటు సతీమణి మెలిస్సా వద్దకు వచ్చి కౌగిలించుకున్నారు. విచారణ సందర్భంగా బైడెన్‌ సతీమణి, హంటర్‌ తల్లి జిల్‌ బైడెన్‌ కోర్టుకు వచ్చారు. తీర్పు వెలువరించిన తర్వాత భార్య, తల్లితో కలిసి హంటర్‌ కోర్టు నుంచి వెళ్లిపోయారు. మరోవైపు కుమారుడి కేసులో తీర్పును అంగీకరిస్తున్నానని, ఈ కేసులో తాను కుమారుడి తరఫున క్షమాభిక్ష కోరబోనని అధ్యక్షుడు జో బైడెన్‌ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news