ఐస్‌ల్యాండ్‌లో బద్దలైన అగ్నిపర్వతం.. నివాసాలపైకి లావా

-

ఐస్‌ల్యాండ్‌లో అగ్నిపర్వతం బద్ధలైంది. దాణ్నుంచి వెలువడిన లావా జనావాసాల్లోకి చేడంతో ఇళ్లన్నీ కాలి బూడిదయ్యాయి. రెక్జానెస్‌ ద్వీపకల్పంలో ఆదివారం రోజున అగ్నిపర్వతం బద్దలైందని ఐస్‌ల్యాండ్‌ ప్రధాని కాట్రిన్‌ జాకోబ్స్‌డోట్టిర్‌ ధ్రువీకరించారు. గ్రిండావిక్‌కు చీకటి దినమని వ్యాఖ్యానించారు. స్థానికులు సమష్టిగా పనిచేసి ముప్పు నుంచి బయటపడాలని పిలుపునిచ్చారు.

అగ్నిపర్వతం బద్దలైతే ఇక్కడికి లావా రావచ్చని అంచనా వేసిన అధికారులు స్థానికంగా రాళ్లతో ఎత్తైన గట్టును ముందుగానే నిర్మించారు. అయినా ఆదివారం రోజున మాత్రం లావా దాన్ని దాటుకుని ఊళ్లోకి ప్రవేశించి ఇళ్లను బూడిద చేసింది. ఈ క్రమంలో స్థానికులు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతూతమ పెంపుడు జంతువులు, పశువులను కూడా తీసుకెళ్తున్నారు. ఇప్పటి వరకూ ఎలాంటి  ప్రాణనష్టం నమోదు కాలేదని అధికారులు తెలిపారు. దాదాపు నెల రోజుల వ్యవధిలో ఐస్‌ల్యాండ్‌లో అగ్నిపర్వతం బద్దలవడం ఇది రెండోసారి అని వెల్లడించారు. ఈ దేశంలోని పర్యాటక ప్రాంతమైన బ్లూలాగూన్‌ను జనవరి 16 వరకు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news