ఐస్లాండ్ రాజధాని Reykjavik అయిన Fagradalsfjall పర్వతానికి 40 కిలో మీటర్ల దూరంలో ఈ సంఘటన జరిగింది. వంద సంవత్సరాలలో ఇలా జరగడం మొదటి సారి ఇదే. అయితే సైంటిస్టులు అక్కడ చాలా అరుదైన లావా కిందకి పడుతోందని చెప్పారు. అయితే అక్కడ ఉన్న సైంటిస్టులు దాని మీద వండుకున్నారు.
అవును మీరు విన్నది కరెక్టే..! అక్కడ సైంటిస్టులు లావ హాట్ డాగ్స్ మరియు గుడ్లని వేడి లావా మీద వండుకుంటున్నారు. వాళ్ళు ఆ లావాని గ్రిల్ లాగ వాడుకుని వాళ్ళు అక్కడ వండుకోవడం జరిగింది ఇప్పటికే 58 వేల మంది ఈ వీడియోని చూశారు.
ఈ వీడియో మొదలయ్యేటప్పుడు ఒక వ్యక్తి లేవని గ్రిల్ లాగ ఉపయోగించి లావా హాట్ డాగ్స్ ని కుక్ చేయడం జరిగింది. ఆ తర్వాత కరుగుతున్న లావాని చూపించారు. అలానే దాని మీద గుడ్లని వండుకోవడం కూడా దీనిలో మనం చూడొచ్చు.
గుడ్డుని రాయి తో పగలకొట్టి పాన్ మీద వేసి లావా పైన వండుకోవడం జరిగింది ఈ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ లావా అంతా కూడా ఒక నదిలాగ కనబడుతోంది. నిజంగా ఈ వీడియోని చూశారంటే మీరు కూడా షాక్ అవుతారు.