అక్క‌డ రేప్ చేస్తే.. శిక్ష న‌పుంస‌క‌త్వ‌మే

-

పాకిస్థాన్ దేశం లో ఇమ్రాన్ ఖాన్ ప్ర‌భుత్వం కీల‌క చట్టాన్నీ తీసుకు వ‌చ్చింది. ఈ మ‌ధ్య కాలంలో పాకిస్థాన్ లో మ‌హిళ‌ల‌పై లైంగిక దాడులు విప‌రీతం గా పెరుగుత‌న్నాయి. వాటిని అరిక‌ట్ట‌డానికి ఇమ్రాన్ ఖాన్ కొత్త చ‌ట్టం తీసుకువ‌చ్చింది. ఈ రోజు ఈ చ‌ట్టం పార్ల‌మెంట్ ఆమోదం కూడా పొందింది. ఈ కొత్త చ‌ట్టం వ‌ల్ల మ‌హిళ‌ల పై అత్యాచారం చేసిన వారికి కెమిక‌ల్ కాస్ట్రేష‌న్ అని శిక్ష వేస్తారు. కెమిక‌ల్ కాస్ట్రేష‌న్ అంటే వైద్యులు డ్ర‌గ్స్ ఉప‌యోగించి పురుషుల‌ను శృంగారానికి ప‌నికి రాకుండ చేయ‌టం.

ఈ ప‌ద్ద‌తిని ఇక నుంచి పాక్ లో ప్రారంభించ నున్నారు. అయితే ఈ కెమిక‌ల్ కాస్ట్రేష‌న్ ను ప్ర‌స్తుతం ద‌క్షిణ కొరియా, పోలాండ్ తో పాటు అమెరికా లోని కొన్ని రాష్ట్రాల‌లో అమలు చేస్తున్నారు. అయితే రేపిస్టుల‌కు కెమిక‌ల్ కాస్ట్రేష‌న్ చేయ‌డం ఇస్లాం కు, ష‌రియా చ‌ట్టాల‌కు వ్య‌తిరేకమ‌ని జ‌మాత్-ఎ-ఇస్లామి సెనేట‌ర్ ముస్తాక్ అహ్మ‌ద్ అన్నారు. ఈ చ‌ట్టానికి వ్యతిరేకంగా ఆయ‌న నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

 

రేప్ కేసులో దోషులు గా తెలిన వారిని బ‌హిరంగంగా ఉరి తీయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశాడు. కానీ ఈ కెమిక‌ల్ కాస్ట్రేష‌న్ గురించి ఇస్లామిక్ చ‌ట్టాల‌లో లేద‌ని అన్నారు. అయితే అత్యాచార దోషుల‌కు ముందు కెమిక‌ల్ కాస్ట్రేష‌న్ చేసిన త‌ర్వాత ఉరి శిక్ష గురించి ఆలోచిద్దామ‌ని పాక్ ప్ర‌ధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news