షేక్ హసీనాను ఒత్తిడి చేయొద్దు.. అమెరికాకు భారత్‌ రిక్వెస్ట్

-

బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాను అధిక ఒత్తిడికి గురి చేయొద్దని ఏడాది క్రితం భారత్‌ అధికారులు అమెరికాను కోరినట్లు సమాచారం. అక్కడి అధికారులను ఉటంకిస్తూ వాషింగ్టన్‌ పోస్టు పత్రిక ప్రచురించింది. 2024 జాతీయ ఎన్నికలకు ముందు బంగ్లాదేశ్‌ పలువురిని జైళ్లలో వేయడాన్ని ఉద్దేశించి అమెరికా దౌత్యవేత్తలు తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సమయంలో అమెరికా ప్రభుత్వం కూడా బంగ్లాదేశ్‌కు చెందిన ఓ పోలీస్‌ విభాగంపై ఆంక్షలు విధించింది. ఈనేపథ్యంలో భారత అధికారులు వరుసగా అమెరికాతో చర్చలు జరిపినట్లు సమాచారం.

హసీనా విషయంలో మరీ కఠిన వైఖరిని అవలంభించొద్దని కోరినట్లు వాషింగ్టన్‌ పోస్టు పేర్కొంది. అక్కడి ప్రతిపక్షాలు బలపడితే ఆ దేశం ఇస్లామిక్‌ అతివాద శక్తుల కేంద్రంగా మారుతుందని.. అంతిమంగా అది భారత్‌ జాతీయ భద్రతకు సవాళ్లను విసురుతుందని అమెరికాకు వివరించినట్లు తెలిపింది. వ్యూహాత్మక ఏకాభిప్రాయం లేకపోతే.. వ్యూహాత్మక  భాగస్వామి కూడా కాలేరని భారత్ పేర్కొన్నట్లు తెలిపింది. ఆ తర్వాత నుంచి బైడెన్‌ కార్యవర్గం నాటి బంగ్లా ప్రధాని హసీనా, ఆమె అధికారులపై ఆంక్షల విషయంలో కొంత మెతక వైఖరి అవలంభించినట్లు ఈ కథనం వెల్లడించింది..

Read more RELATED
Recommended to you

Exit mobile version