పన్నూపై హత్యాయత్నం వెనుక ఇండియన్ ‘రా’!

-

సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూపై అమెరికాలో జరిగిన హత్యాయత్నంలో భారత్‌ ప్రమేయం ఉందంటూ ఇప్పటికే ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. తాజాగా పన్నూపై హత్యాయత్నంలో భారత గూఢచర్య సంస్థ ‘రా’ అధికారి ప్రమేయం ఉందని పేర్కొంటూ వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక సోమవారం ఓ కథనం ప్రచురించింది.

అమెరికాలోని సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎఫ్‌జె) సంస్థ అధికార ప్రతినిధి, ఖలిస్థానీల కీలక నేత గురుపత్వంత్‌ సింగ్‌ను భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికాలో ప్రాణాంతక ఆపరేషన్‌ను భారత గూఢచర్య సంస్థ నిర్వహించడంపై అగ్రరాజ్య అధికారులు విస్మయం వ్యక్తం చేశారని ఆ కథనం పేర్కొంది. అమెరికా నిఘా విభాగాలు గురుపత్వంత్‌పై హత్యాయత్నాన్ని అడ్డుకున్నాయని తెలిపింది.

‘రా’ ఉన్నతాధికారుల అనుమతితోనే ఓ అధికారి ఆ పనికి సిద్ధమయ్యారని, అందువల్ల ఈ హత్యాయత్నంలో వారి ప్రమేయం కూడా ఉంటుందని అమెరికా నిఘా, గూఢచర్య వర్గాలు భావిస్తున్నట్లు ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’ కథనం పేర్కొంది. మోదీకి అత్యంత సన్నిహితమైన అంతర్గత బృందానికి కూడా గురుపత్వంత్‌ను హతమార్చే పథకం సమాచారం తెలుసునని, అందుకు కొన్ని ఆధారాలను కూడా అమెరికా సంస్థలు కొంతమేరకు గుర్తించినట్లు ఈ కథనం వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news