జైలుపై ఇస్లామిక్ స్టేట్ గ్రూపు దాడి… 21 మంది మృతి..!

-

అఫ్గానిస్థాన్ జలాలాబాద్, నాన్ గర్హార్ జైలు పై ఇస్లామిక్ స్టేట్ గ్రూపు (ఐఎస్) చేసిన ఉగ్రదాడిలో దాదాపు 21 మంది మృతి చెందారు. 43 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓ కారు బాంబు జైలు ప్రవేశద్వారం వద్ద పేలింది. ఆపై భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు ఐఎస్ తీవ్రవాదులు. రాత్రంతా ఇరుపక్షాల మధ్య కాల్పులు జరిగాయి. ఇదే అదనుగా కొంతమంది ఖైదీలు జైలు నుంచి తప్పించుకున్నారు. మరికొందరు ఖైదీలు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.

ISIS
ISIS

తామే దాడికి పాల్పడినట్లు ఖొరాసన్ ​లోని ఐఎస్ ఉగ్రసంస్థ ప్రకటించింది. అయితే, దాడి వెనుక అసలు కారణం ఇంకా తెలుపలేదు. ఓ సీనియర్ ఐఎస్ ఉగ్రవాద కమాండర్.. అఫ్గాన్ ప్రత్యేక బలగాల చేతిలో హతమైన ఓ రోజు తర్వాత ఈ దాడి జరగడం గమనార్హం. కొన్ని రోజులు క్రితం అఫ్గానిస్థాన్ కి మంచి రోజులు వచ్చాయని అనుకున్నారు. ఎందుకు అంటే తాలిబన్​ శాంతి ఒప్పందానుసారం అఫ్గానిస్థాన్​ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమయింది కాబట్టి. ఈ నేపధ్యంలో ఎటువంటి ఉగ్ర చర్యలు జరగవని అనుకున్నారు. కాకపోతే ఈ సంఘటనతో అఫ్గానిస్థాన్ దేశం మరోసారి భయాందోళనకు గురైంది.

Read more RELATED
Recommended to you

Latest news