రఫాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 44 మంది మృతి

-

రఫాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 44 మంది మరణించారు. మృతుల్లో 3 నెలల చిన్నారి సహా 12 మంది పిల్లలు ఉన్నట్లు సమాచారం. శనివారం తెల్లవారుజామున ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. రఫాను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ఆదేశించిన మరుసటి రోజే ఈ దాడులు జరిగాయి.

అంతకుముందు రఫాపై గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు వైమానిక దాడులతో ఇజ్రాయెల్‌ విరుచుకుపడింది. మొదటి దాడిలో స్థానిక కువైట్‌ ఆసుపత్రి సమీపంలోని ఓ భవనం ధ్వంసం కాగా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. వారిలో ముగ్గురు చిన్నారులు సహా ఒక మహిళ ఉన్నారు. మరో వైమానిక దాడిలో ముగ్గురు పాలస్తీనియన్లు మరణించారు.సెంట్రల్‌ గాజాలో నిరాశ్రయులైన వారి కోసం ఏర్పాటు చేసిన శిబిరంపై జరిగిన ఇంకో దాడిలో నలుగురు పౌరులు మరణించారు. 30 మంది గాయపడ్డారు.మరోవైపు ఇజ్రాయెల్‌ దాడులతో గాజాలో సాధారణ పౌరుల మరణాలు రోజురోజుకూ పెరిగిపోతుండటంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news