కాల్పుల విరమణపై ఇజ్రాయెల్‌ తాజా ప్రతిపాదన.. హమాస్‌ స్పందన ఇదే

-

రఫాపై దాడికి ఇజ్రాయెల్‌ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు మరోసారి తెరపైకి వచ్చాయి. తాజాగా ఇజ్రాయెల్‌ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్‌ తెలిపింది. అయితే దీన్ని తాము పరిశీలిస్తున్నామని, త్వరలోనే స్పందన తెలుపుతామని పేర్కొంది. ఇజ్రాయెల్‌ ప్రతిపాదనలోని అంశాలను మాత్రం హమాస్‌ సీనియర్‌ నేత ఖలీల్‌ అల్‌ హయ్యా వెల్లడించలేదు.

ఈ నెల 13వ తేదీన ఈజిప్టులో జరిగిన చర్చల్లో 40 మంది ఇజ్రాయెలీ బందీల విడుదల, ఇందుకు ప్రతిగా వందలాది మంది పాలస్తీనియన్‌ ఖైదీలను విడిచే పెట్టే అంశం తెరపైకి వచ్చింది. అయితే తాజా ప్రతిపాదనలో బందీల సంఖ్య 33కి తగ్గిందని సమాచారం. కాల్పుల విరమణ చర్చల్లో తొలి నుంచీ కీలక పాత్ర పోషిస్తున్న ఈజిప్టు బృందం ఇజ్రాయెల్‌కు చేరుకుంది. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్‌ దాడికి వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news