‘బతికుండాలంటే.. 24 గంటల్లో గాజాను వీడండి’.. పౌరులకు ఇజ్రాయెల్‌ ఆదేశాలు

-

ఇజ్రాయెల్​-హమాస్​ల మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. హమాస్ మొదలుపెట్టిన యుద్ధానికి తాము ముగింపు పలుకుతామని ఇటీవలే ఇజ్రాయెల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోంది ఇజ్రాయెల్. గాజాను మట్టికరిపించాలని ప్రయత్నిస్తున్న ఈ దేశం.. అష్టదిగ్బంధనం చేసి వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. ఇక తాజాగా భూతల దాడులకు కూడా రెడీ అవుతోంది.

హమాస్ మిలిటెంట్ సంస్థలో ఏ ఒక్కర్నీ వదలబోమని శపథం చేసిన ఇజ్రాయెల్.. గాజాను తుడిచిపెట్టాలనే యోచనలో ఉంది. ఈ నేపథ్యంలో 24 గంటల్లో గాజాను ఖాళీ చేసి వెళ్లాలని అక్కడి పౌరులను హెచ్చరించింది. ఇప్పటికే భారీ సంఖ్యలో సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకులు, సైనికులను మోహరించిన ఇజ్రాయెల్.. 24 గంటల్లోగా ఉత్తరగాజాలో ఉన్న 11 లక్షల మంది ప్రజలు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఐక్య రాజ్య సమితికి కూడా ఇజ్రాయెల్‌ సమాచారం ఇచ్చింది. అయితే ఉత్తర గాజాలో నివాసం ఉంటున్న 11 లక్షల మంది ఖాళీ చేయడం అసాధ్యమని.. అది వినాశకరమైన మానవతా సంక్షోభానికి దారి తీస్తుందని ఐరాస అధికార ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news