కాంగ్రెస్ కు షాక్.. బీఆర్ఎస్ లోకి పొన్నాల లక్ష్మయ్య..?

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచే ఎన్నికల హడావిడి మొదలైంది. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ 115 అభ్యర్థులను ప్రకటించింది. అందులో మైనంపల్లి హన్మంతరావు ఒక్కరూ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరోవైపు బీజేపీ ఈనెల 16న అభ్యర్థులను ప్రకటించనుంది. కాంగ్రెస్ బస్సు యాత్ర తరువాత అభ్యర్థులను ప్రకటించనుంది కాంగ్రెస్. మరోవైపు జనసేన, బీఎస్పీ కూడా కొంత మంది అభ్యర్థులను ప్రకటించాయి. 

కాంగ్రెస్ ఈ సారి అధికారంలోకి రావాలనే సంకల్పంతో కచ్చితంగా గెలిచే అభ్యర్థులకే టికెట్లు కేటాయిస్తున్నామని పేర్కొంది. ఈ నేపథ్యంలో జనగాంలో మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకి టికెట్ దక్కలేదు. దీంతో పొన్నాల లక్ష్మయ్య మనస్తాపం చెంది కాంగ్రెస్ పార్టీకీ రాజీనామా చేశారు. పార్టీలో తనకు అవమానం జరిగిందని.. మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. వై.ఎస్.క్యాబినెట్ లో నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేశారు పొన్నాల. తెలంగాణ ఏర్పడిన తరువాత తొలి పీసీసీ చీఫ్ గా పని చేశారు. జనగామ టికెట్ పొన్నాలను కాదని.. కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి టికెట్ కేటాయించనున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ లో కేటీఆర్ సమక్షంలో త్వరలోనే  చేరనున్నట్టు సమాచారం. 

Read more RELATED
Recommended to you

Latest news