ఇటలీ తొలి మహిళా ప్రధానిగా జార్జియా మెలోని ప్రమాణం

-

ఇటలీ తొలి మహిళా ప్రధాన మంత్రిగా జార్జియా మెలోని ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో పాటు 24 మంది సభ్యులతో కూడిన మంత్రివర్గం కూడా ప్రమాణ స్వీకారం చేసింది. బ్రదర్స్‌ ఆఫ్‌ ఇటలీ పార్టీకి చెందిన అతివాద నేత మెలోని ఇటీవల జరిగిన ఎన్నికల్లో 26.37 శాతం ఓట్లు సాధించారు. ఫోర్జా ఇటాలియా, లీగ్ పార్టీలతో కూడిన ఆమె నేతృత్వంలోని కూటమి 43 శాతానికి పైగా ఓట్లతో విజయం సాధించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీలో పూర్తి అతివాద ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

ఆ దేశాధ్యక్షుడు సెర్గియో మత్తరెల్లా సమక్షంలో మెలోని ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.  సుదీర్ఘ చర్చల అనంతరం శుక్రవారం మెలోని తన మంత్రివర్గాన్ని ప్రకటించారు. సొంత పార్టీకి తొమ్మిది క్యాబినెట్ పదవులు.. లీగ్, ఫోర్జా ఇటాలియాలకు ఐదు చొప్పున శాఖలు కేటాయించారు. ఈ క్యాబినెట్‌లో మొత్తం ఆరుగురు మహిళలు ఉన్నారు. ఉక్రెయిన్‌ సంక్షోభం, ఆర్థిక మాంద్యం, పెరుగుతోన్న ఇంధన బిల్లుల వంటి సవాళ్ల నడుమ ఈ కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version