Army Helicopter crash : హెలికాప్టర్ ప్రమాదానికి ముందు ఏం జరిగిందంటే..?

-

అరుణాచల్ ప్రదేశ్‌ లో ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో చివరి మృతదేహాన్ని కూడా గుర్తించినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. అయితే ఘటనకు ముందు ఏం జరిగిందో కూడా వెల్లడించింది. హెలికాప్టర్ ప్రమాదానికి ముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు ఒక మేడే కాల్ వచ్చిందని ప్రకటించింది.

‘ప్రమాదానికి ముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి మేడే కాల్‌ వచ్చింది. అది సాంకేతిక లోపాన్ని సూచించింది. అది అత్యవసర ప్రమాదకర పరిస్థితికి నిదర్శనం. కానీ ప్రమాద సమయంలో వాతావరణం అనుకూలంగా ఉంది. పైలట్ల అందరూ అనుభవం కలవారు. అయితే కొండలు, దట్టమైన అడవులు కలిగిన ఆ ప్రాంతం అత్యంత సవాలుతో కూడుకున్నది. ఇక ఆ హెలికాప్టర్‌ 2015 నుంచి విధుల్లో ఉంది. ఘటనకు గల కారణాలను గుర్తించేందుకు విచారణ ఆదేశించాం’ అని ఆర్మీ ప్రకటనలో వెల్లడించింది.

‘శుక్రవారం రోజున కూలిన ఆర్మీ హెలికాప్టర్‌లో ఉన్నవారంతా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఐదో మృత దేహాన్ని సిబ్బంది గుర్తించారు. ఈ ప్రమాదంలో కూలిపోయింది స్వదేశీ తయారీ  సాయుధ హెలికాప్టర్‌’ అని హెచ్‌ఏఎల్‌ రుద్ర తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version