దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్‌ను కట్టడి చేసేందుకు జపాన్ కీలక అడుగు వేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆస్ట్రేలియా నౌకాదళానికి కీలకమైన అణుశక్తి సబ్‌మెరైన్ల తయారీ ఒప్పందమైన ఆకస్‌ను విస్తరించే అవకాశం ఉంది. అంతే కాకుండా దానిలోకి జపాన్‌ను కూడా తీసుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఫైనాన్షిల్ టైమ్స్ కథనంలో పేర్కొంది. త్వరలోనే దీనిపై చర్చలు మొదలుకానున్నట్లు తెలుస్తోంది.
ఆకస్ కూటమిలోని రక్షణ మంత్రులు సోమవారం భేటీ కానున్నారు. ఈ భేటీ అనంతరం ఒప్పందంలోని పిల్లర్-2ను బలోపేతం చేయడంపై ప్రకటన చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా చైనాను కట్టడి చేయాలంటే టోక్యో ఈ కూటమిలోకి రావాలనే బలమైన వాదన ఉంది. తైవాన్‌పై ఒక వేళ చైనా దాడి చేస్తే కట్టడి చేయడానికి అవకాశం ఉంటుందని జపాన్ మాజీ ప్రధాని టారో అసో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కూటమి ఏర్పాటుపై చైనా రుసరుసలాడుతోంది. ప్రాంతీయంగా ఆయుధ పోటీనిని ఇది ఎగదోస్తుందని పేర్కొంది.