ప్రయోగించిన క్షణాల్లోనే పేలిపోయిన జపాన్‌ తొలి ప్రైవేటు రాకెట్‌..!

-

జపాన్‌ దేశం చేపట్టిన తొలి ప్రైవేటు రాకెట్‌ ప్రయోగం విఫలమైంది. స్థానిక కాలమానం ప్రకారం ఇవాళ మధ్యాహ్నం దాదాపు 60 అడుగుల పొడవైన కైరోస్‌ రాకెట్‌ చిన్న ప్రభుత్వ ప్రయోగ ఉపగ్రహాన్ని తీసుకొని నింగికి ఎగిరింది. కానీ, కొన్ని క్షణాల్లోనే ఇది పేలిపోయి గాల్లోనే అగ్నిగోళంలా మారిపోయింది. దీని శకలాలు చూట్టూ ఉన్న పర్వత పాదాలపై పడటంతో తక్షణమే అక్కడున్న నీటి స్ప్రింక్లర్లు పనిచేయడం మొదలుపెట్టాయి.

ఈ ఘటన పశ్చిమ జపాన్‌లోని వకయమ ప్రిఫిక్చర్‌లోని లాంచ్‌ ప్యాడ్‌లో చోటు చేసుకొంది. ేలుడు ఫలితంగా లాంచ్‌ ప్యాడ్‌ ఏరియా మొత్తం నల్లటి పొగ కమ్మేసింది. వాస్తవానికి ప్రయోగించిన 51 నిమిషాల్లోనే ఈ రాకెట్‌ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చాల్సి ఉండగా విఫలం కావడంతో లక్ష్యాన్ని చేరలేకపోయింది. టోక్యోకు చెందిన స్పేస్‌ వన్‌ సంస్థ ఈ రాకెట్‌ను నిర్మించింది. ఈ ప్రయోగం విజయవంతమైతే ఆ దేశంలో శాటిలైట్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తొలి ప్రైవేటు సంస్థగా ఇది రికార్డు సృష్టించేది.

Read more RELATED
Recommended to you

Exit mobile version