హైవేపై కూలి.. కారు, బైక్ ను ఢీ కొట్టిన విమానం.. 10 మంది మృతి

-

మలేసియాలో ఘోర ప్రమాదం జరిగింది. చార్టర్​ విమానం అదుపుతప్పి కూలిన ఘటనలో 10 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటన కౌలాలంపుర్​కు ఉత్తరాన ఉన్న హై​వేపై చోటుచేసుకుంది. లంకావి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సుల్తాన్​ అబ్దుల్ అజీజ్ షా విమానాశ్రయానికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఎక్స్​ప్రెస్​ వేపై కూలిపోయింది.

ఆ సమయంలో విమానంలో ఉన్న ఆరుగురు ప్రయాణికులతో పాటు ఇద్దరు సిబ్బంది మృతి చెందారు. ఈ విమానం ఎక్స్​ప్రెస్ వేపై కూలడం వల్ల కారుతో పాటు బైక్​ను ఢీ కొట్టిందని.. దీంతో మరో ఇద్దరు మరణించారు. ఈ విషయాన్ని ఎయిర్ పోర్టు అధికారులు ధ్రువీకరించారు.

ఇవాళ మధ్యాహ్నం 2.47 నిమిషాలకు సుబంగ్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ టవర్‌కు తాము ప్రమాదంలో ఉన్నట్లు విమానం నుంచి సందేశం వచ్చిందని.. ఆ తర్వాత 2.48కి ఎమర్జెన్సీ లాండింగ్‌కు అనుమతి ఇచ్చినట్లు అధికారులు వివరించారు. సిగ్నల్​ ఇచ్చిన మూడు నిమిషాలకే 2. 51 నిమిషాల సమయంలో విమానం రహదారిపై కూలిందని తెలిపారు. ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకునేందుకు విమానం బ్లాక్ బాక్స్​ను వెతుకుతున్నట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news