నర్సింగ్ హోంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న ఘటన చైనా దేశంలో జరిగింది. ఓ నర్సింగ్ హోంలో జరిగిన ప్రమాదంలో 20 మంది మృత్యువాత పడ్డారు. మరికొందరు గాయపడ్డారు. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
చైనాలోని చెంగ్డే నగరంలోని లాంగ్ హువా కౌంటీలోని ఓ నర్సింగ్ హోంలో మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. అవి వేగంగా వ్యాప్తి చెందడంతో ఆస్పత్రిలో ఉన్న 20 మంది ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే మంటలు అదుపు చేశారు. అయితే అప్పటికే 20 మంది మంటల్లో చిక్కుకుని మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. నర్సింగ్ హోంలో ఫైర్ సేఫ్టీ సదుపాయాలు ఉన్నాయో లేదో అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.