ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు డాక్టర్ సి.ఆర్.రావు కన్నుమూత

-

ప్రముఖ గణాంక, గణిత శాస్త్రవేత్త కల్యంపూడి రాధా కృష్ణారావుకు (సీఆర్​ రావు) (102) కన్నుమూశారు. అమెరికాలో ఉన్న ఆయన.. అనారోగ్యంతో ఇవాళ తుదిశ్వాస విడిచారు. గణిత శాస్త్రంలో అందించిన సేవలకు గానూ స్టాటిస్టిక్స్‌ రంగంలో అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. ఆయన సేవలను గుర్తించిన భారత్‌ ప్రభుత్వం ఆయన్ను పద్మవిభూషణ్‌తో సత్కరించింది. ఆయన చేసిన కృషి.. ఇప్పటికీ సైన్స్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతూనే ఉందని ఇంటర్నేషనల్‌ ప్రైజ్‌ ఇన్‌ స్టాటిస్టిక్స్‌ ఫౌండేషన్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

సీఆర్‌ రావు .. భారత్​లో 75 ఏళ్ల కిందట గణాంక రంగంలో విప్లవాత్మకమైన ఆలోచనలకు బీజం వేసినందుకుగానూ ఆ రంగంలో నోబెల్‌ బహుమతికి సమానమైన ఇంటర్నేషనల్‌ ప్రైజ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ 2023 అవార్డును పొందారు. 102 ఏళ్ల వయసులో ఈ ఏడాదే ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 1945లో కోల్‌కతా మేథమేటికల్‌ సొసైటీలో ప్రచురితమైన సీఆర్‌ రావు పరిశోధన పత్రానికి ఈ పురస్కారం ఆయనకు దక్కింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version