విశాఖలో వైసీపీ పార్టీ భూస్థాపితమే – ఎంపీ రఘురామ

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా తుడిచిపెట్టుకపోనున్న తమ వైసీపీ పార్టీ, విశాఖలో మరింత దారుణంగా తుడిచి పెట్టుకుపోబోవడానికి తమ పార్టీ నాయకుల భూదాహమే కారణమని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. రుషికొండకు గుండు కొట్టి జగన్ మోహన్ రెడ్డి గారు టూరిజం కాటేజీల ముసుగులో నివాస సముదాయాన్ని నిర్మించుకున్నారని, A1 కు ఒక కొండ ఉన్నప్పుడు A2 అయినా నాకు ఒక కొండ లేదా? అని భావించి కాబోలు… ఆనందపురం జంక్షన్ సమీపంలోని విష్ణు పాదాలు, విగ్రహాలు దొరికిన తుర్లవాడ కొండపై తమ ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి గారు కన్నేశారని అన్నారు.

ఇప్పటికే విశాఖపట్నంలో వేల ఎకరాల భూములను తమ పార్టీ నాయకులు కబ్జా చేశారని, దసపల్లా హిల్స్ భూములను బలవంతంగా లాక్కున్నారని, సారా వ్యాపారం నిర్వహిస్తున్నారని, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో కూడా వీరి పెత్తనమే కొనసాగుతోందని తెలిపారు. వీరి అంతులేని ధన దాహానికి రాష్ట్రం అంతులేని రుణ దాహంతో అపసోపాలు పడుతుందని, పది ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాల గుర్తింపుతో కేజీ నుంచి పీజీ వరకు అంతర్జాతీయ యూనివర్సిటీని నెలకొల్పాలనే కోరిక విజయసాయి రెడ్డి గారికి కలిగిందని, ప్రైవేటు యూనివర్సిటీ ఏర్పాటుచే ఈసి, సీట్లు అమ్ముకునే విజయ సాయి రెడ్డి గారు, మార్కెట్ ధరకు కాకుండా 120 ఎకరాల భూమికి కేవలం 15 కోట్ల రూపాయలు చెల్లిస్తానని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అన్నారు. ఎకరా మూడు కోట్ల రూపాయల ధర చేసే భూమికి, కేవలం 13 నుంచి 14 లక్షల రూపాయలు చెల్లిస్తాననడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version