ప్రధాని మోదీకి మరో దేశ అత్యున్నత పురస్కారం

-

భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు ఆ దేశ అత్యున్నత పురస్కారం లభించింది. శ్రీలంక అత్యున్నత పురస్కారమైన మిత్ర విభూషణ అవార్డును ఆ దేశ అధ్యక్షుడు దిసనాయకే ప్రధాని మోదీకి శనివారం రోజున ప్రదానం చేశారు. ఈ అవార్డు అందుకున్న తర్వాత మోదీ మాట్లాడుతూ.. శ్రీలంక అత్యున్నత పురస్కారం లభించటం 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. 2019 ఉగ్ర దాడి, కొవిడ్‌, ఆర్థిక సంక్షోభం సహా ప్రతి క్లిష్ట పరిస్థితిలో శ్రీలంకకు భారత్‌ అండగా నిలిచినట్లు గుర్తుచేశారు.

భారత్‌, శ్రీలంక మధ్య తొలిసారి ప్రతిష్టాత్మక రక్షణ సహకార ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఒప్పందంపై తాజాగా ఇరు దేశాలు సంతకాలు చేశాయి. శ్రీలంక పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, రాజధాని కొలంబోలో అధ్యక్షుడు దిసనాయకేతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ భేటీలో రక్షణ సహా పలు కీలక రంగాలకు సంబంధించిన ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రధఆని మోదీ తెలిపారు. ట్రింకోమలీని ఇంధన కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు జరిగిన ఒప్పందంపై ఇరుదేశాలు సంతకం చేసినట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news