పొరుగుదేశం చేరిన మంకీపాక్స్.. పాకిస్థాన్ లో మూడు కేసులు

-

ఆఫ్రికా దేశాల్లో అలజడి సృష్టిస్తోన్న మంకీపాక్స్ మహమ్మారి మన పొరుగుదేశం చేరింది. పాకిస్థాన్‌లో ముగ్గురికి మంకీ పాక్స్ సోకినట్లుగా అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.  ఆగస్టు 3న సౌదీ అరేబియా నుంచి స్వదేశానికి ముగ్గురు పాకిస్థానీలకు ఆరోగ్య సమస్యలు తలెత్తడం వల్ల వైద్య పరీక్షలు చేయించుకోగా మంకీ పాక్స్‌ ఉన్నట్లు నిర్ధరణ అయ్యిందని తెలిపింది.

ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పాక్‌ ఆరోగ్యశాఖ .. విమానంలో వారితో ప్రయాణించిన వ్యక్తులతో పాటు సన్నిహితులను గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా పేర్కొంది. పొరుగుదేశానికి మంకీపాక్స్ చేరడంతో భారత్ అప్రమత్తమైంది. నివారణ చర్యలు తీసుకుంటూనే.. భారత్​లో మంకీపాక్స్ వ్యాప్తి చెందే ప్రమాదం చాలా తక్కువగా ఉందని.. భయపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మన దేశంలో చివరి ఎంపాక్స్ కేసు ఈ ఏడాది మార్చిలో కేరళలో బయటపడిన విషయం తెలిసిందే.

ఆఫ్రికా దేశాలను వణికిస్తున్న మంకీపాక్స్‌ కాంగోలోనే 96శాతం వ్యాపించింది.  చుట్టుపక్కల 13 దేశాల్లో మిగిలిన కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటివరకు 122 దేశాల్లో 99,518 కేసులు వెలుగుచూసినట్లు WHO తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news