‘పీఎం 2.5’తో ఏడాదికి 10 లక్షలకు పైగా మరణాలు

-

ప్రస్తుతం ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్యల్లో కాలుష్యం ఒకటి. వివిధ రకాల కాలుష్యం వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే కాలుష్యకారక పీఎం 2.5 సూక్ష్మ ధూళికణాలను కొన్ని గంటల పాటు కొన్ని రోజులే పీల్చినా పెను ప్రమాదమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2000-2019 మధ్య కాలంలో 13 వేల నగరాల్లో ఈ వాయుకాలుష్యం కలిగించే ఈ ధూళి కణాల ప్రభావంపై ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు.

ఈ 20 సంవత్సరాల కాలంలో పీఎం 2.5తో ఏడాదికి 10 లక్షల కంటే ఎక్కువ మంది అకాల మరణం చెందారని వీరి అధ్యయనంలో తేలిందని ది లాన్సెట్ జర్నల్ ప్రచురించింది. ఇందులో 65 శాతం మరణాలు ఆసియాలోనే సంభవించాయని పరిశోధకులు తెలిపారు. పీఎం 2.5 కాలుష్యంతో చనిపోతున్న మృతుల సంఖ్యలో 2000, 2010, 2019 సంవత్సరాల్లో చైనా అగ్రస్థానంలో ఉందని, ఈ రెండు దశాబ్దాల కాలంలో దక్షిణాసియా దేశాల ర్యాంకింగ్స్‌లో అనూహ్య పెరుగుదల నమోదైందని వెల్లడించారు. పీఎం 2.5 మృతుల్లో 2000లో బంగ్లాదేశ్‌ 11వ ర్యాంకులో ఉంటే 2019కు వచ్చేసరికి మూడో స్థానంలో నిలిచింది. అదే కాలంలో భారత్‌ 15 నుంచి ఎనిమిదికి, పాకిస్థాన్‌ 14 నుంచి తొమ్మిదికి చేరాయి.

Read more RELATED
Recommended to you

Latest news