మొరాకోలో తీవ్ర భూకంపం.. 296 మంది దుర్మరణం.. ప్రధాని మోదీ సంతాపం

-

గత కొన్ని నెలల క్రితం తుర్కియే, సిరియాలో భూకంపం సృష్టించిన విలయాన్ని, విషాదాన్ని ప్రపంచం ఇంకా మరవలేదు. ఇంతలోనే మరో దేశంలో తీవ్ర భూకంపం అక్కడి ప్రజల ప్రాణాలను బలితీకుసుకుంటోంది. తాజాగా మొరాకో దేశంలో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో (11.11 గంటలకు) మొరాకోలోని మర్రకేష్‌ ప్రాంతంలో వచ్చిన తీవ్ర భూకంపానికి ప్రజలు బెంబేలెత్తిపోయారు.

ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. మర్రకేష్‌కు 71 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని తెలిపింది. భూ అంతర్భాగంలో 18.5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొంది. భూకంపం వల్ల ఆ దేశంలో ఇప్పటికి 296 మంది మరణించారు. వేల మంది తీవ్రంగా గాయపడ్డారు. చాలా మంది ఇంకా శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆ దేశంలో ప్రస్తుత పరిస్థితులు చాలా భయానకంగా ఉన్నాయి. రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపడుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news