మళ్లీ నోరు పారేసుకున్న ట్రంప్.. 9 వేల డాలర్లు ఫైన్

-

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోరు పారేసుకున్నారు. కోర్టు హెచ్చరించినా నోరు పారేసుకున్న ట్రంప్కు మరోసారి భారీ ఫైన్ పడింది. ట్రంప్ అత్యాచారం చేశారని మహిళా జర్నలిస్ట్ ఇ. జీన్ కెరోల్‌ గతంలో కోర్టులో కేసు వేయగా.. ఈ కేసులో చాలామంది సాక్షుల నోటిని మూయించేందుకు ట్రంప్ డబ్బులు ఇచ్చారనే అభియోగాలు ఉన్నాయి.

ఈ కేసుకు సంబంధించి నోరు మెదపొద్దని, మీడియా ఎదుట వ్యాఖ్యలు చేయొద్దని గతంలో న్యూయార్క్ కోర్టు ఆదేశాలు జారీ చేసినా వాటిని పట్టించుకోకుండా ట్రంప్ తన సొంత సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో ఈ కేసులో సాక్షులుగా ఉన్న వారిపై వివిధ కామెంట్లు పెట్టారు. ఈ వివరాలన్నింటితో 10 అభియోగాలు ట్రంప్‌పై నమోదు చేయగా, వాటిలో 9 కోర్టు విచారణలో నిజమేనని రుజువయ్యాయి. ట్రంప్‌పై రూ.7.50 లక్షల (9000 యూఎస్ డాలర్లు) జరిమానా విధిస్తూ న్యూయార్క్ కోర్టు తీర్పు ఇచ్చింది. తన వ్యవహార శైలిని మార్చుకోకుంటే, ఇదే విధంగా కోర్టు ధిక్కారాన్ని కొనసాగిస్తే జైలుశిక్ష కూడా విధిస్తామని న్యూయార్క్ కోర్టు వార్నింగ్ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version