ఉత్తమ నటుడిగా నవీన్ చంద్రకు ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ అవార్డు

-

గతేడాది నవంబరులో థియేటర్లలో రిలీజై, ప్రేక్షకులను థ్రిల్‌ చేసిన పొలిమేర-2 సినిమా ప్రతిష్ఠాత్మక ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ అవార్డు సొంతం చేసుకుంది. మరోవైపు, శ్రీసింహా హీరోగా తెరకెక్కిన ‘ఉస్తాద్‌’ చిత్రానికి ఆ ఫెస్టివల్‌లో ‘ఆనరరీ జ్యూరీ మెన్షన్‌’ విభాగంలో ఆ అవార్డు దక్కింది. మరోవైపు ‘మంత్‌ ఆఫ్‌ మధు’ చిత్రానిగానూ నవీన్‌ చంద్ర ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. నవీన్‌ చంద్ర, స్వాతి ప్రధాన పాత్రల్లో శ్రీకాంత్‌ నాగోతి తెరకెక్కించిన ఈ సినిమా 2023 అక్టోబరులో థియేటర్లలో విడుదలైంది. ఓటీటీ ‘ఆహా’లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

 

 

తమ సినిమాకు పురస్కారం రావడం పట్ల ఉస్తాద్ చిత్రబృందం సోషల్‌ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకుంటూ చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. ‘‘ప్రేమతో మేం తెరకెక్కించిన ఈ సినిమాకి అవార్డు వచ్చింది. దీనికి కారణమైన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు’’ అని పేర్కొంది. భారతీయ సినిమా పితామహుడు దాదా సాహెబ్‌ ఫాల్కే జయంతి సందర్భంగా దిల్లీలో 14వ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ను మంగళవారం నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version