ఈ ఏడాది అమెరికా అధ్యక్ష స్థానంలో మహిళ ఉండబోతున్నారు అని నంలో ఓ మహిళ ఉండబోతున్నారు. ఆ అవకాశం తనకుగానీ.. కమలా హారిస్‌కుగానీ దక్కవచ్చు’ అని రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి ట్రంప్‌తో పోటీపడుతున్న నిక్కీహేలీ అన్నారు. అయితే ఆ ఛాన్స్ తనకు గానీ కమలా హారిస్‌కు గానీ దక్కవచ్చు అని నిక్కీ హేలీ ఓ వార్తా సంస్థకు తెలిపారు. నిక్కీ హేలీతోపాటు డెమొక్రటిక్ పార్టీకి చెందిన కమలా హారిస్ కూడా భారతీయ మూలాలున్న మహిళ అన్న సంగతి తెలిసిందే.
తాను డొనాల్డ్ ట్రంప్‌నకు రెండు సార్లు ఓటు వేశానని నిక్కీ తెలిపారు. ఆయన పరిపాలనలో ఐక్యరాజ్య సమితి రాయబారిగా పని చేయడం తనకు గర్వకారణం అని చెప్పారు. కానీ డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం చాలా గందరగోళంగా ఉంటుందని ఆరోపించారు. దేశాన్ని మరోసారి ఆ పరిస్థితుల్లోకి తీసుకెళ్ల దలచుకోలేదని వ్యాఖ్యానించారు. ట్రంప్ ఎన్నికల్లో గెలవలేరని, కోర్టు కేసుల్లో ఆయన కూరుకుపోయారని హేలీ విమర్శించారు.