KCR: నేడు అసెంబ్లీకి రానున్న కేసీఆర్ !

-

బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ నేడు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు. రెండు రోజుల కిందట సమావేశాలు ప్రారంభం అవ్వగా ఆయన శాసనసభకు హాజరుకాలేదు. కాగా, ఇవాళ 2024-25 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఆయన సభకు రానున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ తొలిసారిగా సమావేశాలకు హాజరవుతుండటంపై ఆసక్తి నెలకొంది.

KCR coming to the Assembly today

కాగా, తెలంగాణ సర్కార్ శాసనసభలో ఇవాళ ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈరోజు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో తొలి మూడు నెలల కాలానికి సంబంధించిన కేటాయింపులే బడ్జెట్‌లో ఉన్నా.. ఏడాది మొత్తానికి అంచనాలు ప్రకటించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news