నిత్యానంద ‘కైలాస’తో డీల్.. పరాగ్వే అధికారి పదవి ఉఫ్

-

పదుల సంఖ్య అత్యాచార కేసుల్లో నిందితుడిగా మారి భారత్​ నుంచి పారిపోయిన వివాదాస్పద స్వామీ నిత్యానంద ఈక్వెడార్ సమీపంలోని ఓ దీవిలో నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. నిత్యానంద ఊహాజనిత దేశం యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ కైలాసతో చేసుకున్న డీల్ ఓ అధికారి ఉద్యోగం ఉఫ్​మనిపించింది. కైలాస ప్రతినిధులతో అవగాహనా ఒప్పందం చేసుకున్న పరాగ్వే వ్యవసాయశాఖ అధికారి తన ఉద్యోగాన్ని కోల్పోయారు. మరోవైపు దక్షిణ అమెరికాలోని పలువురు ప్రభుత్వాధికారులను నిత్యానంద తప్పుదోవపట్టించినట్లు సమాచారం. ఇలా ఈ వివాదాస్పద స్వామీ పలు దేశాలకు తలనొప్పిగా మారుతున్నాడు.

ఈ ఏడాది మొదట్లో యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ కైలాస ప్రతినిధులు జెనీవాలో నిర్వహించిన ఐరాస సమావేశాల్లో పాల్గొనగా.. ఈ భేటీలో పాల్గొన్న పరాగ్వే వ్యవసాయ శాఖ కీలక అధికారి.. కైలాసతో దౌత్యసంబంధాల ఏర్పాటుకు కృషి చేస్తానని.. అంతర్జాతీయ వేదికలపై కైలాస దేశ సార్వభౌమత్వానికి గుర్తింపు లభించేలా మద్దతు ప్రకటిస్తూ ఓ ప్రకటనపై సంతకం చేశారు. అయితే దీనిపై పరాగ్వేలో అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఇదో పెద్ద స్కామ్​ అని ఆరోపిస్తూ పరాగ్వే నెటిజన్లు నెట్టింట హల్​చల్ సృష్టించారు. ఈ నేపథ్యంలో స్పందించిన సదరు అధికారి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. తనకు కైలాస దేశం ఎక్కడుందో తెలీదనీ.. నీటిపారుదల సహా ఇతర సమస్యల్లో సాయం చేస్తామని నిత్యానంద ప్రతినిధులు చెప్పడం వల్లనే పత్రంపై సంతకం చేశానని ఆయన మీడియాకు వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version