కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తుంది. చాలా వేగం గా ఈ కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతుంది. అయితే ఇప్పటి వరకు స్పష్టం గా వ్యాధి తీవ్రత గానీ లక్షణాలు కానీ తెలియడం లేదు. కానీ డెల్టా వేరియంట్ కన్న వేగం గా వ్యాప్తి చెందుతుందని తెలుస్తుంది. అలాగే డెల్టా వేరియంట్ తో ఓమిక్రాన్ ను పోలిస్తే.. భిన్న మైన లక్షణాలు ఉన్నాయని సమాచారం. అయితే ఓమిక్రాన్ సోకిన చాలా మంది లో అలసట, బలహీనత ఎక్కువ గా ఉంటుంది.
అయితే వీటి తో పాటు రాత్రి పూట ఓమిక్రాన్ సోకిన వారికి అతి గా చెమటలు వస్తున్నాయని దక్షిణాఫ్రికా కు చెందిన వైద్యులు అంతర్జాతీయ మీడియాకు తెలుపుతున్నారు. కాగ తొలి ఓమిక్రాన్ కేసు దక్షిణాఫ్రికా లోనే వచ్చిందన్న విషయం తెలిసిందే. అలాగే దక్షిణాఫ్రికా లో ఓమిక్రాన్ విజృంభన కూడా ఎక్కువ గానే ఉంది. కాగ ఓమిక్రాన్ వేరియంట్ చాలా ప్రమాదకరమైన వైరస్ గా మారే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య శాఖ ప్రతినిధులు తెలుపుతున్నారు.