మైక్రోసాఫ్ట్​లోకి ఓపెన్‌ఏఐ మాజీ సీఈఓ ఆల్ట్‌మన్‌

-

ఓపెన్‌ఏఐ మాజీ సీఈఓ శామ్ ఆల్ట్​మన్​కు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆల్ట్​మన్​ తమ కంపెనీలో చేరుతున్నారని ఆయన సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా స్వయంగా ప్రకటించారు. తమ కంపెనీలో ఉన్న కొత్త ఏఐ పరిశోధన బృందంలో ఆయన చేరతారని తెలిపారు. ఆయనతో పాటు ఓపెన్ ఏఐ నుంచి బయటకు వచ్చిన గ్రెగ్ బ్రాక్​మన్ కూడా తమతో కలిసి పని చేస్తారని వెల్లడించారు. ఆల్ట్​మన్.. బ్రాక్​మన్​తో కలిసి మైక్రోసాఫ్ట్ ఏఐ టీమ్​కు సారధ్యం వహించనున్నారని నాదెళ్ల చెప్పారు.

ఈ ఇరువురు తమ పనిలో విజయం సాధించేందుకు కావాల్సిన అన్ని వనరులను మైక్రోసాఫ్ట్ వీలైనంత త్వరగా సమకూర్చుతుందని సత్య నాదెళ్ల తెలిపారు. అయితే వీరితో పనిచేస్తున్నా.. ఓపెన్ ఏఐతో తమ భాగస్వామ్యం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆ సంస్థతో కలిసి తాము రూపొందించిన ప్రోడక్ట్ రోడ్​ మ్యాప్ ముందుకు సాగుతుందని తెలిపారు. ఓపెన్‌ఏఐ కొత్త టీమ్, టీమ్ లీడర్​తో కలిసి పని చేసేందుకు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సత్య నాదెళ్ల ట్వీట్​లో పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news