ఆపరేషన్ సింధూర్ దెబ్బకు.. పాకిస్థాన్ లో ఎమర్జెన్సీ ప్రకటన చేశారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో… మోడీ ప్రభుత్వం విరుచుకుపడుతోంది. ఈ దెబ్బకు ఇప్పటికే 80 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు మరణించారు.

దింతో పాకిస్థాన్ లో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేయడంతో పాక్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్, ముల్తాన్, ఫైసలాబాద్, షెషావర్ ఎయిర్ పోర్టుల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇస్లామాబాద్, రావల్పిండిలో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. వైద్య సిబ్బందికి సెలవును పాక్ అధికారులు రద్దు చేశారు. పాక్ పంజాబ్ ప్రావిన్స్ లోని విద్యాసంస్థలను మూసివేయాలని ఆదేశించారు.