ఇరాన్ పై పాకిస్థాన్ ప్రతీకార దాడులు.. మిలిటెంట్ల స్థావరాలపై బాంబుల వర్షం!

-

ఇటీవల బలూచిస్థాన్లోని ‘జైష్‌ అల్‌ అదిల్‌’ మిలిటెంటు గ్రూపునకు చెందిన రెండు స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్‌ దాడులకు తెగబడిన విషయం తెలిసిందే. ఇరాన్ చేసిన దాడులకు తాజాగా పాకిస్థాన్ ప్రతీకార చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఇరాన్లోని వేర్పాటు వాదుల స్థావరాలపై వైమానిక దాడులు జరిపినట్లు తెలుస్తోంది.

ఇరాన్ భూభాగంలో తలదాచుకుంటున్న బలూచిస్థాన్ వేర్పాటువాద క్యాంపులపై తమ దేశ వైమానిక దళం దాడులు చేసినట్లు పాక్ విదేశాంగ శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. పాకిస్థాన్లో వాంటెడ్గా ఉన్న మిలిటెంట్లే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ దాడుల్లో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారని.. ఈ నిఘా ఆపరేషన్కు ‘మార్గ్ బర్ సర్మాచార్’ అని నామకరణం చేసినట్లు పాక్ విదేశాంగ శాఖ తన ప్రకటనలో తెలిపింది. మరోవైపు ఈ దాడికి సంబంధించినవని పేర్కొంటూ కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే, ఈ దాడుల్లో నలుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలు చనిపోయారని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news