IPL 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 209 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ 2 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది.

కాగా IPL 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ కి చెందిన 14 ఏళ్ల యువ ప్లేయర్ వైభవ్ సూర్య వంశీ సూపర్ సెంచరీ చేశాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేశాడు. అలానే ఐపీఎల్ లోనే ఇది సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ కావడం విశేషం. గతంలో క్రిస్ గేల్ 30 బంతుల్లో సెంచరీ చేశాడు.