భారత్ పై మేమే విజయం సాధించాం అంటూ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరో వివాదానికి తెరలేపాడు. కాల్పుల విరమణపై స్పందించాడు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. భారత్ పై పాక్ విజయం సాధించిందంటూ చెప్పుకున్నాడు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. తమ దేశాన్ని, పౌరులను రక్షించుకోవడానికి ఏం చేయడానికైనా వెనుదిరిగేది లేదంటూ ప్రకటన చేశారు.

ఇది ఇలా ఉండగా పాక్ కాల్పుల్లో మరో భారత్ అధికారి మృతి చెందాడు. సరిహద్దులో జరిగిన కాల్పులలో.. బీఎస్ఎఫ్ ఎస్సై వీర మరణం పొందారు. జమ్మూలోని ఆర్ఎస్ పుర ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దులో కాల్పులు జరిగాయి. జమ్మూలోని ఆర్ఎస్ పురా ప్రాంతంలోని సరిహద్దు వద్ద పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో బిఎస్ఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎండి ఇంత్యాజ్ మృతి చెందారు.