ఆర్థిక సంక్షోభం పాకిస్థాన్ ప్రజలను ముప్పు తిప్పలు పెడుతోంది. ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పాక్ ప్రజలపై మరో బాంబు పేలింది. ఆ దేశ ప్రభుత్వం ఇంధన ధరలను భారీగా పెంచింది. గతనెల 29న లీటర్ డీజిల్, పెట్రోల్‌పై రూ.35 చొప్పున పెంచిన షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం.. తాజాగా పెట్రోల్‌పై రూ.22.20, హై స్పీడ్ డీజిల్‌పై రూ.17.20, కిరోసిన్‌పై రూ.12.90 చొప్పున వడ్డించింది.
ప్రస్తుతం పాకిస్థాన్‌లో లీటర్ పెట్రోల్ కొనాలంటే రూ.272 (పాక్ కరెన్సీలో) ఖర్చు చేయాల్సిందే. ఇక హైస్పీడ్ డీజిల్ ధర రూ.280, లైట్ స్పీడ్ డీజిల్ రూ.196.68, కిరోసిన్ రూ.202.73కు పెరిగాయి. పెరిగిన ధరలు ఇవాళ తెల్లవారుజాము నుంచే అమల్లోకి వచ్చాయి. పాక్ రూపాయి విలువ దారుణంగా పడిపోవడంతో పెట్రోల్, డీజిల్‌తోపాటు నిత్యావసర పదార్థాల ధరలు పాకిస్థాన్‌లో ఆకాశాన్నంటాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఏఎంఎఫ్)తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు మినీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కొద్దిగంటల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం గమనార్హం.