మరో శ్రీలంకలా పాకిస్థాన్.. పెట్రోల్​ కోసం బారులు తీరిన జనం..!

-

పాకిస్థాన్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. చూస్తుంటే త్వరలోనే పాకిస్థాన్ మరో శ్రీలంకలా మారబోతోందని నిపుణులు అంటున్నారు. విదేశీ మారక నిల్వలు ఖాళీ కావడం వల్ల పాక్‌లో చమురు దిగుమతులు ప్రభావితమయ్యాయి. పంజాబ్‌ ప్రావిన్స్‌లో చాలావరకు పెట్రోల్‌ పంపులు మూతపడినట్లు డాన్ పత్రిక వెల్లడించింది. నెలరోజులకుపైగా పెట్రోల్‌ పంపులకు సరఫరా నిలిచిపోయిందని పేర్కొంది.

జన జీవనం స్తంభించి రోజువారీ కార్యకలాపాలపై ప్రభావం పడినట్లు తెలిపింది. సరిపడా పెట్రోనిల్వలు అందుబాటులో ఉన్నాయని.. అక్రమ నిల్వలపై కఠినచర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించినా.. కొరత అలాగే ఉన్నట్లు వెల్లడించింది.

మరోవైపు పెట్రోలియం డీలర్స్‌ అసోసియేషన్.. చమురు సరఫరా సంస్థలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. డిమాండ్‌కు సరిపడా సరఫరా చేయడం లేదని డీలర్స్ అసోసియేషన్ ఆరోపిస్తోంది. నిల్వలు ఉన్నా ఎక్కువ ధరకు విక్రయించేందుకు సరఫరాను నిలిపివేశారన్న ఆరోపణలను చమురు సంస్థలు ఖండిస్తున్నాయి. పెట్రోల్‌ పంపులు ఖాళీగా ఉండటం వల్ల పట్టణ ప్రాంతాల్లోని వాహనదారులు గ్యాస్‌ వాడాలని సూచిస్తున్నారు

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version