భవిష్యత్తు లో ఏ ఇబ్బంది ఉండకూడదని చాలా మంది నచ్చిన వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తూ వుంటారు. ఆర్థికంగా భరోసా ఉంచాలని కుటుంబం ఇబ్బందులు పడకూడదని చాలా మంది ఇన్సూరెన్స్ చేసుకుంటారు. దేశంలో నూటికి తొంబై మంది ప్రభుత్వం రగం సంస్థ జీవిత బీమా సంస్థ ని నమ్మి నచ్చిన వాటిల్లో పెట్టుబడి పెడుతున్నారు. ఇందులో డబ్బులు పెడితే ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. ఎల్ఐసీలో పాలసీ ని చాలా మండే తీసుకుని వుంటారు.
ఆ పాలసీతో పాన్ కార్డ్ లింక్ చేయాలి. గడువు కూడా దగ్గర పడుతోంది. 2023, మార్చి 31 లోపు పాలసీలతో పాన్ ని లింక్ చేసుకోవాలని కస్టమర్లకు ఎల్ఐసీ సూచించింది. ఇది వరకు చాలా సార్లు ఈ గడువు ని పెంచింది. కనుక ఇప్పుడు పక్కాగా లింక్ చేసుకోండి. పాన్ కార్డ్ అప్డేట్ చేయకపోతే పాలసీ ల్యాప్స్ అయ్యే రిస్క్ ఉందని గుర్తు పెట్టుకోండి. ఇక ఎలా పాన్ కార్డ్ అప్డేట్ చెయ్యాలనేది చూద్దాం.
మొదట మీరు linkpan.licindia.in/UIDSeedingWebApp/getPolicyPANStatus లోకి వెళ్లి లాగిన్ అవ్వాలి.
నెక్స్ట్ పాలసీ నంబర్ ని ఎంటర్ చెయ్యండి.
డేట్ ఆఫ్ బర్త్, జెండర్, పాన్ కార్డ్ వంటి వివరాలని ఇవ్వండి.
అలానే మీ ఇ-మెయిల్ అడ్రస్ ని కూడా ఇవ్వాలి.
పాన్ కార్డులో ఉన్న విధంగా మీ పూర్తి పేరు, ఫోన్ నంబర్, పాలసీ నంబర్ ని ఎంటర్ చేయాలి.
డీటెయిల్స్ ఇచ్చేసి క్యాప్చా ఎంటర్ చేయాలి.
గెట్ ఓటీపీ ఆప్షన్ మీద ఎంపిక చేసుకోండి.
ఫోన్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసేయండి. ఆ తరవాత సబ్‌మిట్ బటన్ ని నొక్కండి.
ఇప్పుడు స్క్రీన్‌పై ఎల్ఐసీ పాన్ కనెక్షన్ రిక్వెస్ట్ స్టేటస్ కనపడుతోంది.