విమానంలో నిద్రపోయిన పైలెట్… హైజాక్ అనుకుని హైరానా

-

విమానం నడిపేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి.. ఒక్క చిన్న పొరపాటు చాలు ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి. అయితే తాజాగా ఘటనలో మాత్రం విమానం నడుపుతూ పైలెట్ నిద్రపోయాడు. దీంతో 10 నిమిషాల పాటు గ్రౌండ్ కంట్రోల్, ఏటీసీతో పైలెట్ ఎలాంటి కమ్యూనికేషన్ కు రెస్పాండ్ కాలేదు. దీంతో అధికారులు హైరానా పడ్డారు. విమానం హైజాక్ అయిందని భావించారు. ఈ ఘటన  అమెరికా న్యూయార్క్ నుంచి ఇటలీ రోమ్ వెళ్తున్న ఐటీఏ ఎయిర్ లైన్స్ కు చెందిన ఏజెడ్ 609 విమానంలో జరిగింది.

flight

విమానాన్ని ఆటో పైలెట్ లో ఉంచిన పైలెట్ నిద్రపోయాడు. దీంతో ఏటీసీ విమానంతో ఎంతగా కమ్యూనికేట్ చేద్ధాం అని ప్రయత్నించినా…అందుబాటులోకి రాలేదు. దీంతో ఫ్రాన్స్ అధికారులు ఫ్లైట్ హైజాక్ అయిందని భావించారు. ఈ విషయాన్ని ఇటలీ అధికారులకు కూడా తెలిపారు. రక్షణ కోసం రెండు ఫైటర్ జెట్లను కూడా సిద్ధం చేశారు. ఎట్టకేలకు ఎన్నో ప్రయత్నాల తరువాత పైలెట్ స్పందించారు. అయితే కమ్యూనికేషన్ చేస్తున్న క్రమంలో కొన్ని పరికరాలు పనిచేయలేదని పైలెట్ విచారణలో చెప్పారు. అయితే పైలెట్ మాటలన్నీ అబద్ధాలని తేలింది. దీంతో అతన్ని ఉద్యోగం నుంచి తీసేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version