ఆస్ట్రియాలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం

-

ప్రధాని నరేంద్ర మోదీ మూడ్రోజుల విదేశీ పర్యటన కొనసాగుతోంది. సోమ, మంగళవారాల్లో రష్యాలో పర్యటించిన ఆయన ఇవాళ ఆస్ట్రియాలో పర్యటిస్తున్నారు. రష్యా పర్యటన ముగించుకొని ఆస్ట్రియా రాజధాని వియన్నా చేరుకున్న మోదీకి ఆస్ట్రియా విదేశాంగ మంత్రి  అలెగ్జాండర్‌ చెలెన్‌బర్గ్‌ ఘన స్వాగతం పలికారు. తర్వాత ఆస్ట్రియా ఛాన్స్‌లర్‌ కార్ల్‌ నెహమార్‌ ఇచ్చిన ప్రైవేటు విందుకు హాజరయ్యారు.

ద్వైపాక్షిక బంధం బలోపేతమే లక్ష్యంగా ఇరువురు నేతలు చర్చలు జరిపినట్లు విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. రెండు దేశాలు ఎదుర్కొంటున్న బౌగోళిక సవాళ్లను ఎదుర్కొనే విషయంలో పరస్పరం కలిసి ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు వివరించారు. ఈ సందర్భంగా మోదీ, నెహమార్సె ల్ఫీ తీసుకున్నారు. ఈ ఫొటో కూడా సోషళ్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరోవైపు ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్‌ వాన్‌డెర్‌ బెల్లెన్‌తో మోదీ సమావేశం కానున్నారు. 1983 తర్వాత భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించడం ఇదే తొలిసారి. అప్పట్లో ఇందిరాగాంధీ ఆస్ట్రియా పర్యటనకు వెళ్లారు. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని మోదీ ఆస్ట్రియా పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news