ఆస్ట్రేలియాలో హిందూ ఆలయాలపై దాడులపై మోదీ కీలక వ్యాఖ్యలు

-

ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధానితో భేటీ అయ్యారు. ఆయన ముందే ఆ దేశంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల గురించి ప్రస్తావించారు. ఇరుదేశాల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలను దెబ్బతీసే చర్యలను సహించకూడదని చెప్పారు. గతంలోనూ ఈ విషయంపై ఆసీస్ ప్రధానితో తాను చర్చించిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. అలాంటి ఘటనలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకున్నందుకు ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్​కు కృతజ్ఞతలు తెలిపారు. అల్బనీస్​తో ద్వైపాక్షిక చర్చల అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు మోదీ.

“ఆస్ట్రేలియాలో ఆలయాలపై జరుగుతున్న దాడులపై ప్రధానమంత్రి అల్బనీస్, నేను గతంలోనూ చర్చలు జరిపాం. వేర్పాటువాద శక్తుల గురించి చర్చించాం. ఈరోజు కూడా ఆ అంశాలపై మేం సమాలోచనలు చేశాం. భారత్, ఆస్ట్రేలియా మధ్య ఉన్న సత్సంబంధాలను దెబ్బతీయడాన్ని సహించకూడదు. వేర్పాటువాద శక్తులపై ఆస్ట్రేలియా ప్రధాని కఠిన చర్యలు తీసుకున్నారు. ఇకపైనా గట్టి చర్యలు తీసుకుంటామని ప్రధాని అల్బనీస్ నాకు హామీ ఇచ్చారు.”
-నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి

Read more RELATED
Recommended to you

Exit mobile version