ప్రజాస్వామ్యానికి భారత్‌ తల్లివంటిది : యూఎస్ కాంగ్రెస్ సభలో మోదీ

-

ప్రజాస్వామ్యానికి భారత దేశం తల్లివంటిదని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. యూఎస్ కాంగ్రెస్ సభలో ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఉగ్రవాదం.. ప్రజాస్వామ్యం.. భారత్-అమెరికా సంబంధాలు.. ఆధునిక యుద్ధాలు వంటి పలు కీలక అంశాలపై మాట్లాడారు. ప్రజస్వామ్యం అంటే చర్చను ఆహ్వానించడం, సమానత్వానికి మద్దతు తెలపడం, ఆలోచనలు, భావవ్యక్తీకరణలకు రెక్కలు తొడగడమని ప్రధాని వెల్లడించారు. భారత్‌-అమెరికా ప్రపంచానికి మంచి భవిష్యత్తును ఇవ్వడంతోపాటు.. భవిష్యత్తు తరాలకు మంచి ప్రపంచాన్ని అందిస్తాయని పేర్కొన్నారు.

రాజకీయ నాయకులుగా అభిప్రాయభేధాలు ఉండొచ్చని.. కానీ, దేశానికి సంబంధించి మాత్రం ఒకే స్వరంగా మాట్లాడాలని మోదీ పేర్కొన్నారు. దాదాపు 2,500 రాజకీయ పార్టీలు, 22 అధికారిక భాషలు, వేల మాండలీకాలు, ప్రతి 100 మైళ్లకు మారిపోయే ఆహారపు అలవాట్లు ఉన్నా.. ఇప్పటికీ మేము ఒకే స్వరంగా మాట్లాడతామని చెప్పారు. సహజసిద్ధమైన జీవన విధానంలో వైవిధ్యాన్ని మేము గౌరవిస్తామన్నారు. ఆయన ప్రసంగం సందర్భంగా చాలా సార్లు కాంగ్రెస్‌ సభ్యులు నిలబడి చప్పట్లు కొట్టారు. ప్రపంచంలోనే రెండు గొప్ప ప్రజాస్వామ్యాల బంధాన్ని గౌరవించడానికి మీరంతా (కాంగ్రెస్‌ సభ్యులు) ఇలా రావడం సంతోషంగా ఉందని మోదీ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version