పోప్‌ ఫ్రాన్సిస్‌ కన్నుమూత.. ప్రముఖుల సంతాపం

-

పోప్​ ఫ్రాన్సిస్ సోమవారం ఉదయం మరణించారు. వాటికన్‌లోని కాసా శాంటా మార్టా నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. వాటికన్ కామెరెంగో కార్డినల్ కెవిన్ ఫెర్రెల్ ఈ విషయాన్ని ప్రకటించారు. పోప్​ తన జీవితమంతా చర్చి సేవకు అంకిత మయ్యారని ఆయన తెలిపారు. ఇటీవల అస్వస్థతకు గురైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. ఈస్టర్ సందర్భంగా ఆదివారం రోజున సందేశం కూడా ఇచ్చారు. అయితే ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన మరణించారు.

అమెరికాలోని అర్జెంటీనా జార్జ్ మారియో బెర్గోగ్లియోగాలో జన్మించిన ఫ్రాన్సిస్..  పోప్ కావడం విశేష. బెన్‌డిక్ట్ XVI రాజీనామా తర్వాత 2013లో ఫ్రాన్సిస్ పోప్ అయ్యారు. 12 ఏళ్ల నుంచి ఆయన పోప్‌గా కొనసాగుతున్నారు. దాదాపు 1300 సంవత్సర కాలంలో యూరోపియన్ కాని వ్యక్తి పోప్ కావడం ఇదే తొలిసారి. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను ఇటీవల కాలంలో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు మరింత ఇబ్బంది పెట్టాయి. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో చికిత్స పొందారు. అయినా లాభం లేకుండా పోయింది. మరోవైపు పోప్ ఫ్రాన్సిస్ మరణవార్తపై ప్రపంచ వ్యాప్తంగా నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news