రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క సమైక్యవాదులు : కపిలవాయి దిలీప్ కుమార్

-

కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాజీ కాంగ్రెస్ నాయకుడు కపిలవాయి దిలీప్ కుమార్ సంచలన విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమైక్యవాదులు అని ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క సమైక్యవాదులు అని, వాళ్ళు ఇవాళ ఒకరు ముఖ్యమంత్రి, మరొకరు ఉపముఖ్యమంత్రి అయ్యారన్నారు.

తెలంగాణ ఇచ్చినప్పుడు.. తెలంగాణ ఇవ్వొద్దని వ్యతిరేకించిన టీడీపీ పార్టీలో రేవంత్ రెడ్డి ఉన్నారని.. ఇవాళ అదే సమైక్యవాదులు,, ఉద్యమ ద్రోహులను తీసుకొచ్చి మంత్రులను చేశారన్నారు. నేడు సెక్రటేరియట్లో 10, 12 శాతం కమీషన్ ఇస్తే కానీ బిల్లులు రావడం లేదని,
ఇది మనం ఆశించిన తెలంగాణ కాదన్నారు.

రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయన్ను 5 సార్లు కలిస్తే ప్రతిసారీ తనను నిల్చోబెట్టి మాట్లాడారని.. మాట్లాడితే రేవంత్ బట్టలు ఊడదీసి కొడుతా అంటున్నాడు.. ముందు కొట్టాల్సింది నీ మంత్రులనే అని అన్నారు. ఎందుకంటే వాళ్ళు అవినీతి చేస్తున్నారని.. రేవంత్ జరిగితే తన సీట్లో కూర్చోవాలని చూస్తున్నారని కపిలవాయి దిలీప్ కుమార్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news