బ్రిటన్ రాజ కుటుంబ సభ్యుడిగా తాను ఎదుర్కొన్న అనుభవాలతో ప్రిన్స్ హ్యారీ ‘స్పేర్’ పేరిట స్వీయ జీవిత చరిత్రను రాశారు. ఇందులో ఆయన వెల్లడించిన విషయాలు సంచలనంగా మారాయి. ఈ బుక్ ద్వారా హ్యారీ చిన్నతనం, తన సోదరుడితో ఉన్న బంధం గురించిన మరో విషయం వెలుగులోకి వచ్చింది.
‘విల్లీ నా కంటే రెండేళ్లు పెద్దవాడు. విల్లీ సింహాసనానికి వారసుడు. నేను స్పేర్(అదనం). నేను అతడి నీడను. ప్లాన్ ఏ పనిచేయనప్పుడు నన్ను ప్లాన్ బిగా వాడతారు. విల్లీకి ఏదైనా జరగరానిది జరిగితే అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు నన్ను ఈ లోకంలోకి తీసుకువచ్చారు’ అని వెల్లడించారు.
‘నా తండ్రి కింగ్ చార్లెస్-3, నా సోదరుడు విలియం ఎన్నడూ ఒకే విమానంలో ప్రయాణించరు. దాంతో సింహాసనం అధిష్టించేందుకు తర్వాత వరుసలో ఉన్న వారికి ఎలాంటి అనూహ్య ప్రమాదం జరగకుండా ఉండేందుకు ఈ ఏర్పాటు. నా విషయంలో ఎప్పుడూ అలాంటి జాగ్రత్త ఉండదు. నన్నెప్పుడు అదనం(Spare)గానే భావించడం వల్ల పెద్దగా ప్రాధన్యం ఉండేది కాదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.