ఫ్రాన్స్ లో మోనాలిసా చిత్రంపై సూప్‌ చల్లి నిరసన

-

ఫ్రాన్స్‌లో మరోసారి ఆగ్రహజ్వాలలు పెల్లుబికాయి. రైతుల సమస్యలపై అక్కడ పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నారు. సాంకేతిక విధానాలను సరళీకరించాలని,  వాహనాలకు డీజిల్‌ ఇంధన పన్నును రద్దు చేయాలన్న పలు డిమాండ్లతో ఫ్రాన్స్‌లోని పలు ప్రాంతాల్లో రైతులు నిరసనకు దిగారు. ఈ క్రమంలోనే లౌవ్రే మ్యూజియంలోకి చొచ్చుకెళ్లిన పర్యావరణ కార్యకర్తలు ఆందోళన చేశారు. ఆ ఇద్దరు పర్యావరణ కార్యకర్తలు పారిస్‌లోని లౌవ్రే మ్యూజియంలోని మోనాలిసా చిత్రానికి రక్షణగా ఏర్పాటు చేసిన గాజు పలకపై సూప్‌ చల్లి నిరసన వ్యక్తం చేశారు. ఆదివారం రోజున ఈ ఘటన చోటుచేసుకుంది.

వ్యవసాయ రంగం దుర్భరంగా ఉందని.. మన రైతులు ప్రాణాలు కోల్పోతున్నారంటూ పర్యావరణ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ నినాదాలు చేస్తూనే మోనాలిసా చిత్రంపై సూప్ చల్లినట్లు మ్యూజియం సిబ్బంది తెలిపారు. వారిని అడ్డుకునేలోపే సూప్ చల్లారని వెల్లడించారు. అప్పటికే అప్రమత్తమై మ్యూజియం నుంచి సందర్శకులను ఖాళీ చేయించినట్లు చెప్పారు. ఈ ఘటనకు కారణమైన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version